గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన
- October 30, 2023
గుజరాత్: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు గుజరాత్ లో పర్యటించనున్నారు. అక్టోబర్ 30,31 తేదీల్లో గుజరాత్ లో పర్యటించి పలు అభివద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలతో బిజీ బిజీగా గడపనున్నారు. దీంట్లో భాగంగా ప్రధాని గుజరాత్ కు చేరుకున్నారు.మోదీ మొదటిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా బనస్కాంత్ జిల్లాలోని అంబాజీ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.
చిక్లాలోని సుందరమైన ప్రాంతంలో కొలువైన అంబాజీ ఆలయం ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ఈ ఆలయానికి విచ్చేసిన ప్రధానికి అర్చకులు ప్రధానికి ఘన స్వాగతం పలికి పూజలు చేయించారు. అంబాజీ ఆలయానికి చేరుకున్న సమయంలో మోదీ క్యూలో నిలబడిన భక్తులకు అభివాదం చేసుకుంటు ఆలయంలోని ప్రవేశించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గుజరాత్ పర్యటన కోసం అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి గుజరాత్ గవర్నర్ అచార్య దేవవ్రత్, సీఎం భూపేంద్ర పటేల్ ఘన స్వాగతం పలికారు. ఈ రెండు రోజుల పర్యటనలో ప్రధాని రూ. 5,950 కోట్లు విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు. రోడ్డు, తాగునీరు, నీటిపారుదల మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







