మష్రూమ్ ఆమ్లెట్
- May 23, 2016
కావలసిన పదార్థాలు: మష్రూమ్స్ - 100 గ్రా., గుడ్లు - 3, మిరియాల పొడి - అర టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 2, కొత్తిమీర - 1 కట్ట, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 2 టేబుల్ స్పూన్లు.
తయారుచేసే విధానం: మష్రూమ్స్ శుభ్రం చేసి చిన్నచిన్న ముక్కలుగా తరిగి కొద్ది నీటిలో 5 నిమిషాలు ఉడికించి వడకట్టాలి. ఒక లోతైన పాత్రలో గుడ్లు గిలకొట్టి ఉల్లి, మష్రూమ్స్, పచ్చిమిర్చి తరుగులతో పాటు పసుపు, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపి 5 నిమిషాలు పక్కనుంచాలి. ఇప్పుడు పెనంపై నూనె రాసి ఆమ్లెట్ వేసి, కొత్తిమీర తరుగు చల్లి, రెండువైపులా దోరగా కాల్చుకోవాలి. ఈ ఆమ్లెట్ టిఫిన్‌గా తిన్నా, అన్నంతో నంజుకున్నా బాగుంటుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







