గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ ట్యాంకులు
- October 31, 2023
దోహా: ఇజ్రాయెల్ దళాలు సోమవారం ఉత్తర, మధ్య గాజాలోకి ప్రవేశించాయి. సెంట్రల్ గాజాలో ఒక ఇజ్రాయెల్ ట్యాంక్ ప్రధాన ఉత్తర-దక్షిణ రహదారిని నిర్బంధించింది. మరోవైపు గాజాపై భూతల దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ మిలటరీ చెప్పింది. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. వాటిల్లో ట్యాంక్ నుంచి సైనికులు కాల్పులు జరుపుతున్నట్లు కనిపించింది. ఇదిలా ఉండగా వేలాది మంది క్షతగాత్రులతో పాటు పదివేల మంది పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్న ఆసుపత్రులకు దగ్గరగా వైమానిక దాడులు జరుగుతున్నాయని UN హెచ్చరించింది. కొన్ని వీడియోలలో ఓ జర్నలిస్ట్ భయంతో పారిపోతూ, "గో బ్యాక్! గో బ్యాక్!" అనడం కనిపించింది. ఉత్తర గాజా పరిసర ప్రాంతాలకు ఇరువైపులా ఇజ్రాయెల్ తమ బలగాలను మోహరించింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు మరణించిన వారి పాలస్తీనియన్ల సంఖ్య 8,000 దాటింది. మృతుల్లో ఎక్కువగా మహిళలు,పిల్లలు ఉన్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్-పాలస్తీనా హింసాకాండతో గాజాలో 1.4 మిలియన్లకు పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి పోయారు.
The moment a civilian vehicle is targeted by an Israeli tank that arrived in Salah Al-Din Street on October 30, 2023. The journalist's shocked reaction can be heard as he screams in disbelief.
— The Peninsula Qatar (@PeninsulaQatar) October 30, 2023
➡️ https://t.co/hjf2ZtIMqJ#Gaza #Palestine #GazaStrip #SalahAlDinStreet pic.twitter.com/TnjWrR9Ub2
తాజా వార్తలు
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్‌తో గ్రీన్ కారిడార్‌ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!
- ఇరాన్ రాయబార సిబ్బందిని 'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటించిన ఖతార్..!!
- IPL-2026: సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!









