'రైట్.. రైట్..' జూన్ 10న

- May 23, 2016 , by Maagulf
'రైట్.. రైట్..' జూన్ 10న

సుమంత్ అశ్విన్, పూజా ఝావేరి జంటగా నటించిన చిత్రం 'రైట్‌రైట్‌'. మను దర్శకత్వం వహించిన ఈ సినిమలో ప్రభాకర్‌ కీలక పాత్రధారి. శ్రీసత్య ఎంటర్‌టైనమెంట్స్‌ పతాకంపై జె.వంశీకృష్ణ నిర్మించారు. జూన్ 10న ప్రేక్షకుల ముందుకిరానుందీ సినిమా. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ ''లక్ష్యం కోసం తపించే ఓ కుర్రాడి కథ ఇది. లక్ష్య సాధనలో భాగంగా బస్సు కండక్టర్‌ అయిన ఆ కుర్రాడికి ఓ అందమైన అమ్మాయి తారసపడుతుంది. వారిద్దరి మధ్య ఎటువంటి అనుబంధం ఏర్పడింది? అతని లక్ష్యం ఏమైంది అనేది కథ. నేనిప్పటి వరకూ చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది. ఫస్టాఫ్‌ కామెడీగానూ, సెకెండాఫ్‌ మిస్టరీగా సాగుతుంది'' అని చెప్పారు. ''ఎస్‌.కోట నుంచి గవిటి వెళ్లే బస్సు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. కామెడీ, లవ్‌, మిస్టరీతో ఆధ్యంతం ఉత్కంఠగా ఉంటుంది. సుమంత్ అశ్విన్ కెరీర్‌లోనే హయ్యెస్ట్‌ థియేటర్‌లలో ఈ నెల 10న విడుదల చేస్తున్నాం'' అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శేఖర్‌ వి. జోసఫ్‌, సంగీతం: జె.బి, మాటలు: డార్లింగ్‌ స్వామి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com