మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'గౌతమీపుత్ర శాతకర్ణి'
- May 24, 2016
నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిష్తున్న 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది. క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్టైనమెంట్స్ ప్రై.లి. పతాకంపై వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బిబో శ్రీనివాస్ సమర్పకుడు. నిర్మాతలు మాట్లాడుతూ ''ఎన్నో హాలీవుడ్ సినిమాలు షూటింగ్ జరుపుకునే మొరాకోలోని అద్భుతమైన లొకేషన్లలో రెండు వారాల పాటు చిత్రీకరణ జరుపుకున్న మొదటి తెలుగు సినిమా, మొదటి భారతీయ సినిమా ఇదే. మొరాకోలోని అట్లాస్ స్టూడియోస్, వరు జార్జియస్‌లో చిత్రీకరణ జరిపాం. బాలకృష్ణ, కబీర్ బేడిపై ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో హాలీవుడ్ ఫైటర్లతో యుద్ధ సన్నివేశాల్ని దర్శకుడు క్రిష్ చిత్రీకరించారు. దాదాపు వెయ్యిమంది ఈ షూటింగ్లో పాల్గొన్నారు. రెండు వందల గుర్రాలు, ఒంటెలను ఉపయోగించాం'' అని చెప్పారు. క్రిష్ మాట్లాడుతూ ''ఎంతో ప్రతిష్ఠాత్మకమైన బాలకృష్ణ గారి వందో చిత్రంగా ప్రారంభమైన మా చిత్రం షూటింగ్ అనుకున్న ప్రణాళిక ప్రకారం జరుగుతుండటం సంతోషంగా ఉంది. మొరాకో షెడ్యూల్లో బాలకృష్ణగారు ప్రతిరోజు పద్నాలుగు గంటలపాటు పనిచేశారు. ఆయన ఎనర్జీ మాకెంతో స్ఫూర్తినిచ్చింది'' అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్, మాటలు: సాయి మాధవ్ బుర్రా.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









