అబుదాబి విమానాశ్రయానికి షేక్ జాయెద్ పేరు
- November 01, 2023
యూఏఈ: అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయానికి దివంగత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ పేరు పెట్టనున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అధికారికంగా జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. పేరు మార్పు ఫిబ్రవరి 9, 2024 నుండి అమల్లోకి వస్తుంది. కొత్త టెర్మినల్ నుంచి ఎతిహాద్ ఎయిర్వేస్ మంగళవారం భారతదేశానికి తొలి వాణిజ్య విమానాన్ని నడిపింది. అలాగే అబుదాబి నుండి న్యూఢిల్లీకి EY224 విమానం 359 మంది ప్రయాణికులతో మధ్యాహ్నం 2.35 గంటలకు టెర్మినల్ A నుండి బయలుదేరింది. నవంబర్ 14 నుండి అన్ని విమానయాన సంస్థలు టెర్మినల్ A నుండి ప్రత్యేకంగా పనిచేస్తాయి.ఎతిహాద్ నవంబర్ 9 నుండి దశలవారీగా టెర్మినల్ A కి విమానాలను మారుస్తుంది. నవంబర్ 9 - 14 మధ్య ఎయిర్‌లైన్ టెర్మినల్స్ - 3 నుండి నడుస్తుంది. నవంబర్ 14 ఉదయం 11 గంటల నుండి, క్యారియర్ కొత్త హబ్ నుండి అన్ని విమానాలను నడుపుతుంది. అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మంగళవారం టెర్మినల్‌ను సందర్శించారు.
తాజా వార్తలు
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!







