నవంబర్ 11న అత్యవసర అరబ్ శిఖరాగ్ర సమావేశం
- November 01, 2023
రియాద్: సౌదీ అరేబియా అధ్యక్షతన నవంబర్ 11న రియాద్‌లో అరబ్ దేశాధినేతలు, నాయకుల శిఖరాగ్ర సమావేశం అత్యవసర సమావేశం జరగనుంది. అరబ్ లీగ్ కౌన్సిల్ అసాధారణ సమావేశాన్ని శిఖరాగ్ర స్థాయిలో నిర్వహించాలని పాలస్తీనా, సౌదీ అరేబియా నుండి అధికారిక అభ్యర్థనను అందుకున్నట్లు అరబ్ లీగ్ జనరల్ సెక్రటేరియట్ ప్రకటించింది. అరబ్ లీగ్ ప్రస్తుత 32వ సెషన్‌కు సౌదీ అరేబియా అధ్యక్షత వహిస్తోంది. గాజా స్ట్రిప్‌లో పాలస్తీనా ప్రజలపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దురాక్రమణపై చర్చించేందుకు సమ్మిట్ నిర్వహించాలని పాలస్తీనా, సౌదీ అరేబియా నుండి జనరల్ సెక్రటేరియట్ సోమవారం అధికారిక అభ్యర్థనను స్వీకరించిందని అరబ్ లీగ్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ అంబాసిడర్ హోసామ్ జాకీ తెలిపారు. అరబ్ సభ్య దేశాలకు పాలస్తీనా, సౌదీ మెమోరాండంలను జనరల్ సెక్రటేరియట్ సర్క్యులేట్ చేసిందని తెలిపారు.
తాజా వార్తలు
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!







