జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి.. తీవ్రంగా ఖండించిన యూఏఈ
- November 01, 2023
యూఏఈ: గాజా స్ట్రిప్‌లోని జబాలియా శరణార్థి శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు వందలాది మంది మరణాలకు కారణమైంది. ఇందులో వందలాది మంది గాయపడ్డారు. ఈ దాడిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీవ్రంగా ఖండించింది. విచక్షణారహిత దాడులు ఈ ప్రాంతంలో కోలుకోలేని పరిణామాలకు దారితీస్తాయని చెప్పింది. ఈ మేరకు యూఏఈ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoFA) ఒక ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ మానవతా చట్టం, అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం పౌరులను రక్షించడం ప్రాముఖ్యతను అందులో తెలిపింది. ప్రాణనష్టాన్ని నివారించడానికి తక్షణ కాల్పుల విరమణ పాటించాలని కోరింది.
తాజా వార్తలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్‌ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు







