ఒమన్ లో విజిట్ వీసాల కన్వెర్షర్ రద్దు
- November 01, 2023
ఒమాన్: విజిట్ వీసాలను వర్క్ వీసాలుగా మార్చబోమని రాయల్ ఒమన్ పోలీసులు మంగళవారం ప్రకటించారు. అంతకుముందు ప్రయాణికులు టూరిస్ట్ లేదా విజిట్ వీసాపై దేశంలోకి ప్రవేశించి, ఆపై దానిని వర్క్ వీసాగా మార్చుకునే అవకాశం ఉండేది. కొత్త నిర్ణయం అక్టోబర్ 31 నుండి అమలులోకి వచ్చినట్లు ప్రకటించింది. బంగ్లాదేశీయులకు కొత్త వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికార యంత్రాంగం ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు 100 దేశాల నుండి జిసిసి నివాసితులు ఒమన్‌కు వెళ్లడానికి వీసా అవసరం లేదు. గతేడాది గల్ఫ్ దేశం ఈ జాబితాను విడుదల చేసింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలకు ఏకీకృత టూరిస్ట్ వీసా ఆమోదం పొందింది. ఇవి వచ్చే ఏడాది ప్రారంభంలో జార చేసే అవకాశం ఉందని యూఏఈ మంత్రి గత నెలలో తెలిపారు. దాంతో ఒకే వీసాతో పర్యాటకులు ఆరు గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, ఒమన్ మరియు కువైట్ లను సందర్శించవచ్చు.
తాజా వార్తలు
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్‌ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం







