ఇన్స్యూరెన్స్ కార్యాలయాల్లో ట్రాఫిక్ సెల్
- May 24, 2016
ఖతార్లో ఇకనుంచి ఇన్స్యూరెన్స్ కార్యాలయాల్లోనే ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ సెల్ ద్వారా వాహనదారులకు సేవలు అందించాలని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిర్ణయం తీసుకుంది. ఫేస్ బుక్ అధికారిక పేజ్ ద్వారా ఈ వివరాల్ని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు వాహనదారులు ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ కోసం వెళుతుంటారు. అయితే అక్కడ వారికి ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ నుంచి క్లియరెన్స్ అవసరమవుతుంది. దాని కోసం వాహనదారులు ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయానికి వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులు లేకుండా ఇన్స్యూరెన్స్ కార్యాలయాలకి సమీపంలోనే ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయాల్ని ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుందని భావించి మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐదు కార్యాలయాల్ని ప్రారంభించినట్లు పేర్కొంది. ఇన్స్యూరెన్స్ కంపెనీల వద్ద నియమించిన ట్రాఫిక్ ఇన్వెస్టిగేటర్స్ ప్రమాద వివరాల్ని ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో టాబ్లెట్ ద్వారా రిజిస్టర్ చేసి, పరిస్థితిని ఇన్స్యూరెన్స్ కంపెనీలకు వివరిస్తారు. ఆ తర్వాత ఇన్స్యూరెన్స్ కంపెనీ తన పని తాను చేసుకుపోతుంది. ట్రాఫిక్ డైరెక్టరేట్ మరియు ఇన్స్యూరెన్స్ కంపెనీల మధ్య లింకప్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







