ఈ నెల 7,11,19 తేదీల్లో తెలంగాణకు రానున్న ప్రధాని మోడీ
- November 02, 2023
హైదరాబాద్: ఈ నెల 7వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రానున్నారు. 7వ తేదీతో పాటు 11వ తేదీన నిర్వహించే సభలోనూ ఆయన పాల్గొంటారు. ఈ తేదీల్లో హైదరాబాద్, కరీంనగర్, అదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో సభలు నిర్వహించాలని బిజెపి రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని అమిత్ షా ఇటీవల సభలో ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత ప్రధాని మోడీ తొలిసారి తెలంగాణకు వస్తున్నారు.
నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఈ నెల 15వ తేదీ నుంచి జోరుగా ప్రచారం చేయాలని బిజెపి నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా సహా కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు ప్రచారం చేయనున్నారు. 15వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ఉధృతమయ్యాక 19న మరోసారి ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







