చంద్రబాబు పై హైదరాబాద్‌లో కేసు నమోదు!
- November 02, 2023
హైదరాబాద్: హైదరాబాదులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ర్యాలీ నిర్వహించడంపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ర్యాలీ చేయడంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
కాగా, నిన్న సాయంత్రం గన్నవరం నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు.. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ లోని నివాసం వరకు ర్యాలీగా వెళ్లిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా చంద్రబాబు కోసం అప్పటికే ఆయన నివాసంలో ఎదురుచూస్తున్న ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (AIG) వైద్యుల బృందం ఆయన వచ్చాక ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. వారి సూచన మేరకు ఇవాళ చంద్రబాబు ఏఐజీకి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. అలాగే ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటి పరీక్షలు కూడా చేయించుకునే అవకాశం ఉంది. ఇక అంతకుముందు ఉండవల్లి నుంచి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరిన చంద్రబాబుకు ఏపీ టిడిపి నేతలు దేవినేని ఉమా, యార్లగడ్డ వెంకట్రావు, పీతల సుజాత, బోడే ప్రసాద్, టిడిపి కార్యకర్తలు వీడ్కోలు పలికారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







