ఈనెల 5న దుబాయ్ లో ‘దీపావళి ఉత్సవ్-2023’..
- November 02, 2023
దుబాయ్: సర్వో దీపావళి ఉత్సవ్-2023ని జరుపుకునేందుకు దుబాయ్ సిద్ధమైంది. ఈ ఏడాది వేడుకల్లో ఇండియన్ బాలీవుడ్ సూపర్ స్టార్ జాన్ అబ్రహం, స్టీఫెన్ దేవస్సీ లు ప్రధాన ఆకర్షణగా నిల్వనున్నారు. గతేడాది ఎటిసలాత్ అకాడమీలో నిర్వహించిన దీపావళి ఉత్సవ్ వేడుకలు విజయవంతమైన నేపథ్యంలో ఈ ఏదాడి ‘సర్వో దీపావళి ఉత్సవ్-2023’ని ప్రకటించారు నిర్వాహకులు. ఇది నవంబర్ 5న (ఆదివారం) సాయంత్రం 04.00 నుండి 10.00 గంటల వరకు దుబాయ్ లోని ఈటీమియాస్లో నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం FOI కేంద్ర థీమ్ 'భిన్నత్వంలో ఏకత్వం(యూనిటీ ఇన్ డైవర్సిటీ)'గా ప్రకటించింది. ఈ ఈవెంట్‌కు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా మద్దతు ఇస్తుండగా.. దుబాయ్‌లోని ఎటిసలాట్ అకాడమీలో హిస్ ఎక్సలెన్సీ కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా, FOI నుండి ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ ఏడాది రంగోలి పోటీ (భారత జానపద-కళా రూపం), సాంప్రదాయ భారతీయ ఆటలు ఆకట్టుకోనున్నాయి. భారతదేశంలోని విభిన్న సంస్కృతులను ప్రదర్శించేందుకు 15 కంటే ఎక్కువ భారతీయ రాష్ట్రాల నుండి ఒక ప్రత్యేకమైన జానపద నృత్య బృందాలు వస్తున్నాయి. అలాగే భారతదేశంలోని వివిధ రాష్ట్రాల వంటకాలను సూచించే ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఈవెంట్‌కు వచ్చే సందర్శకులు వేదిక వద్ద ఎంట్రీ టిక్కెట్‌ను కొనుగోలు చేయాలి. టికెట్ వివరాల కోసం (వెబ్సైట్: www.foieventsllc.com / Facebook పేజీ: FOIEvents) లేదా +971 54 996 7563 / +971 52 607 9529 ను సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలియజేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!
- కొత్త ప్రైవేట్ పాఠశాలలపై షురా కౌన్సిల్ ఓటింగ్..!!
- సౌదీ అరేబియాలో షార్క్ కేజ్ డైవింగ్..లైసెన్స్ జారీ..!!
- కువైట్‌లో 'హిమ్యాన్' కార్డుకు అనుమతి..!!







