మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి మరో అరుదైన గౌరవం.!
- November 02, 2023
అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ ఇటీవల యాక్టర్స్ బ్రాంచ్‌లోకి కొంతమంది కొత్త సభ్యుల్ని ఎంపిక చేసింది. తాజాగా మరికొంతమంది ప్రతిభావంతులైన యువ నటుల్ని ఆ బ్రాంచ్‌లోకి చేర్చింది. ఆ లిస్గులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరడం విశేషం.
ఇటీవలే ఈ యాక్టర్స్ బ్రాంచ్‌లోకి ఎన్టీయార్ పేరు చేరింది. తాజాగా రామ్ చరణ్ కూడా చోటు దక్కించుకోవడంతో మెగా అభిమానులు చరణ్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీయార్ గ్లోబల్ స్టార్స్‌గా అరుదైన గౌరవం దక్కించుకున్నారు. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు.
తాజాగా ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ అకాడమీలోనూ చోటు దక్కించుకోవడంతో రామ్ చరణ్‌కి ఇండస్ర్టీ ప్రముఖులు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో విషెస్ పంపిస్తున్నారు.
ప్రస్తుతం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహ వేడుక సందర్భంగా రామ్ చరణ్ ఇటలీలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో ఆయన ప్రస్తుతం నటిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







