దుబాయ్ లో పాస్‌పోర్ట్‌లపై ప్రత్యేక స్టాంప్
- November 03, 2023
దుబాయ్: నవంబర్ 6 నుండి 18 వరకు దుబాయ్ విమానాశ్రయాలకు చేరుకునే ప్రయాణికులు వారి పాస్‌పోర్ట్‌లపై ప్రత్యేక స్టాంప్ పొందుతారని గురువారం ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ స్మారక స్టాంప్‌ను విడుదల చేసింది. ఇది దుబాయ్ ఎయిర్‌షో కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (DXB) లేదా దుబాయ్ వరల్డ్ సెంట్రల్ (DWC) ద్వారా ప్రయాణించినా, ప్రయాణీకులందికి ఈ ప్రత్యేక స్టాంపింగ్ చేయనున్నారు. దుబాయ్ ఎయిర్‌షో 18వ ఎడిషన్ విమానయాన, అంతరిక్ష రంగంలోని తాజా ఆవిష్కరణలు,ఉత్పత్తుల శ్రేణిని ప్రదర్శిస్తుంది. దుబాయ్ వరల్డ్ సెంట్రల్ (డిడబ్ల్యుసి)లో నవంబర్ 13 నుండి 17 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్ కు 95 దేశాల నుండి 1,400 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. 180కి పైగా అత్యాధునిక వాణిజ్య, ప్రైవేట్, సైనిక విమానాలు ప్రదర్శనలో కొలువుదీరనున్నాయి.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







