‘భారతీయుడుని’ మళ్ళీ తీసుకు వచ్చిన రాజమౌళి..
- November 03, 2023
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘భారతీయుడు’. ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఇక శంకర్ ఈ మూవీ ప్రమోషన్స్ ని మొదలుపెట్టడానికి సిద్దమయ్యాడు. ఈక్రమంలోనే ఇండియన్ ఇంట్రో అంటూ ఒక చిన్న టీజర్ ని ఆడియన్స్ కోసం సిద్ధం చేశాడు. ఇక ఈ ఇంట్రో తెలుగులో రాజమౌళి చేతులు మీదుగా జరిగింది. మరి ఆ ఇంట్రో వైపు మీరు కూడా ఒక లుక్ వేసేయండి.
భారతీయుడు మొదటి భాగం చివరిలో కమల్ హాసన్ ఇండియా వదిలి విదేశాలకు వెళ్లిపోయినట్లు చూపించారు. అలాగే ఇండియాలో మళ్ళీ అన్యాయం జరిగితే తాను తప్పకుండా వస్తానని, తనకి మరణం అనేది లేదని చూపించారు. ఆ సీన్ తోనే ఇంట్రో స్టార్ట్ చేశారు. అలా వెళ్లిపోయిన భారతీయుడిని మళ్ళీ రమ్మంటు దేశంలో కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలు సోషల్ మీడియా లో రిక్వెస్ట్ లు పెడుతుండడం, వారి బాధని తెలుసుకున్న భారతీయుడు మళ్ళీ ఇండియాకి తిరిగి రావడం.. ఇంట్రో చూపించారు. మరి ఆ ఇంట్రో వైపు మీరు కూడా ఒక లుక్ వేసేయండి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







