ఎలాంటి పొరపాటు లేకుండా చూడాలి: రాచకొండ సీపీ చౌహాన్

- November 04, 2023 , by Maagulf
ఎలాంటి పొరపాటు లేకుండా చూడాలి: రాచకొండ సీపీ చౌహాన్

హైదరాబాద్: త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని  నామినేషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన భద్రత ఏర్పాట్లను మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడానికి  ఈరోజు రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహన్ రాచకొండ డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసిపిలు, ఎస్ హెచ్ఓ లు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వెలెన్స్ టీం మరియు ఇతర సిబ్బందికి ఆన్లైన్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ట్రైనింగ్ కార్యక్రమంలో ఎన్నికల నిర్వహణ బందోబస్తు సమయంలో పాటించవలసిన నిబంధనల మీద సిబ్బందికి గల పరిజ్ఞానాన్ని పరీక్షించడంతో పాటు నిబంధనల మీద అవగాహన కల్పించారు.  

ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ... ఎన్నికల విధులకు సంబంధించిన నిర్దిష్టమైన సూచనలను తమ కింది స్థాయి సిబ్బందికి అందించాలని, క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే కిందిస్థాయి సిబ్బందికి కూడా ఎన్నికల నిబంధనల మీద  పరిజ్ఞానాన్ని, అవగాహనను కల్పించడానికి సిబ్బందితో అంతర్గత శిక్షణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కమిషనర్ పేర్కొన్నారు. రాచకొండ పరిధిలో అవసరమైన అన్ని చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, అక్రమంగా తరలిస్తున్న డబ్బును పట్టుకోవడానికి పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. సరైన వివరాలు లేకుండా తరలిస్తున్న పరిమితికి మించిన అక్రమ నగదును ఎక్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారి సమక్షంలో సీజ్ చేయాలని సూచించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వెలెన్స్ టీం లు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

ఎన్నికల నిబంధనలకు సంబంధించి ప్రతి అంశంపై అధికారులు మరియు సిబ్బంది  సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలని సూచించారు.  అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని, ఎన్నికల విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించే వ్యక్తుల మీద నిఘా వేసి ఉంచాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, వల్నరబుల్ పోలింగ్ ప్రాంతాల గుర్తింపు పట్ల స్పష్టతతో ఉండాలని, ఎన్నికల నిర్వహణ పరికరాలు తీసుకెళ్ళే రూట్ చెక్ చేసుకోవాలని పేర్కొన్నారు. చెక్ పోస్ట్ ల వద్ద పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేయాలని మరియు అధికారులు సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు.

అత్యవసరం ఉన్న పోలింగ్ స్టేషన్ ప్రాంతాలలో సిసి కెమెరాల ఏర్పాటు, పోలింగ్ స్టేషన్ లో మౌలిక సదుపాయాల ఏర్పాటు ముందుగానే చూసుకోవాలని, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేయాలని, ఇంతకు ముందు ఎలక్షన్స్ సమయంలో ఎదురైన సమస్యలను సృష్టించిన వారి పై పూర్తి నిఘా ఉంచాలని, రౌడీ షీటర్స్ ను, సస్పెక్ట్ షీట్ ఉన్నవారిని, హిస్టరీ షీట్ ఉన్నవారిని  బైండోవర్ చేయాలని తెలిపారు. ఎన్నికల సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్య, గొడవలు సృష్టంచే అవకాశం ఉన్న సోషల్ మీడియా సందేశాలు, వీడియోలు వైరల్ చేసే విషయాలు, చిన్న విషయాలైన ఉన్నత అధికారులకు సమాచారం అందించాలని, సిబ్బంది ఎల్లప్పుడూ అలర్ట్ గా ఉండేలా చూడాలని, సమస్యాత్మక గ్రామాలను విధిగా పర్యటిస్తూ అట్టి  గ్రామాలపై దృష్టిసారించాలని తెలిపారు.

ఈ సమావేశంలో additional CP తరుణ్ జోషి ఐపీఎస్, మల్కాజిగిరి డీసీపీ దరావత్ జానకి, రాచకొండ అడ్మిన్ డీసీపీ ఇందిర, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస రెడ్డి, ఎస్బి అడిషనల్ డీసీపీ రఫీక్, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com