గాజా స్ట్రిప్ నుండి ఆరుగురు పౌరులను రక్షించిన బహ్రెయిన్
- November 04, 2023
బహ్రెయిన్: ఆరుగురు బహ్రెయిన్ పౌరులను గాజా స్ట్రిప్ నుండి రఫా సరిహద్దు క్రాసింగ్ ద్వారా ఈజిప్టుకు బహ్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తరలించింది. క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఫాలో-అప్‌తో హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆదేశాలను ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని కాన్సులర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాల అండర్ సెక్రటరీ డా. మహమ్మద్ అలీ బహ్జాద్ ఆధ్వర్యంలో పౌరుల తరలింపు ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా రఫా సరిహద్దు క్రాసింగ్ ద్వారా తరలింపునకు సహాయం చేసిన ఈజిప్టు విదేశాంగ మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. పౌరులు సురక్షితంగా బహ్రెయిన్‌కు తిరిగి రావడానికి మంత్రిత్వ శాఖ అవసరమైన అన్ని చర్యలు తీసుకుందని డాక్టర్ బహ్జాద్ చెప్పారు. ఇంకా గాజాలోని చిక్కుకున్న బహ్రెయిన్ పౌరులు మంత్రిత్వ శాఖలోని ఫాలో-అప్ కార్యాలయాన్ని +973 17227 555లో సంప్రదించవచ్చని, లేదా జోర్డాన్‌లోని అమ్మన్‌లోని బహ్రెయిన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







