గాజా ఇష్యు.. అమెరికా, అరబ్ నేతలు భేటీ
- November 04, 2023
యూఏఈ: గాజాలో పెరుగుతున్న యుద్ధం, క్షీణిస్తున్న మానవతా పరిస్థితిపై అరబ్ నేతలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై చర్చించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తో జోర్డాన్‌లో అరబ్ నాయకులు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ తక్షణం కాల్పుల విరమణ చేపట్టేలా ఒత్తిడి తేవాలని వారు డిమాండ్ చేయనున్నారు. శుక్రవారం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో బ్లింకెన్ సమావేశమయ్యారు. బందీలను విడిపించేందుకు, గాజాలోకి సహాయాన్ని అనుమతించే విషయంలో సహాయం చేస్తానని, కానీ ఇజ్రాయెల్‌ను నిరోధించలేమని ఆయన అన్నారు. మరోవైపు నెతన్యాహు బందీలను విడిపిస్తే తప్ప కాల్పుల విరమణ గురించి ఆలోచించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బ్లింకెన్.. శనివారం ఎమిరాటీ, సౌదీ, ఖతారీ మరియు ఈజిప్టు విదేశాంగ మంత్రులతో పాటు అమ్మాన్లో పాలస్తీనా ప్రతినిధులతో సమావేశమవుతారని జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా అంబులెన్స్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 15 మంది మరణించారని గాజా ఆరోగ్య అధికారులు తెలిపారు. కాగా, హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెట్ సైన్యం తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







