కుప్పకూలిన ఇండియన్ నేవీ హెలికాప్టర్..అధికారి మృతి
- November 04, 2023
కొచ్చి: భారత నావికాదళానికి చెందిన చేతక్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ అధికారి ప్రాణాలు కోల్పోయారు. నేవీకి చెందిన హెలీకాప్టర్ శనివారం మధ్యాహ్నం నేవీ హెడ్ క్వార్టర్స్‌లోని ఐఎన్‌ఎస్ గరుడ రన్‌వేపై ఈ ప్రమాదం జరిగింది. పైలట్‌తో సహా ఇద్దరికి గాయపడ్డట్లు తెలుస్తున్నది. అలాగే, చాపర్ రోటర్ బ్లేడ్లు తగలడంతో రన్‌వేపై ఉన్న నౌకాదళ అధికారి మృతి చెందినట్లు సమాచారం. ఇద్దరు పైలట్లకు గాయాలైనట్లు ప్రాథమికంగా తెలుస్తున్నది. ఇద్దరిని నావికాదళ ప్రధాన కార్యాలయంలోని సంజీవని ఆసుప్రతికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కొచ్చి హార్బర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







