ఊపిరితిత్తుల ఆరోగ్యానికి పుదీనా జ్యూస్.!

- November 04, 2023 , by Maagulf
ఊపిరితిత్తుల ఆరోగ్యానికి పుదీనా జ్యూస్.!

శరీరంలో అతి ముఖ్యమైన భాగాల్లో ఊపిరితిత్తులు ఒకటి. ప్రస్తుత పరిస్థితుల్లో కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులకు సంబంధించి అనక రకాల సమస్యలు తలెత్తుతున్నాయ్. తద్వారా పలు రకాలా శ్వాస కోశ సంబంధిత రోగాల బారిన పడాల్సి వస్తోంది. శీతాకాలంలో ఆ సమస్యలు మరీ ఎక్కువగా వేధిస్తుంటాయ్. మరి, ఆ సమస్యల నుంచి దూరంగా మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి.? అప్పుడప్పుడూ ఊపిరితిత్తుల్ని క్లీన్ చేసుకోవాలి.
అదేంటీ.? ఇల్లు శుభ్రం చేసుకున్నట్లుగా.. ఊపిరితిత్తులు క్లీన్ చేసుకోవడమేంటీ.? అదెలా సాధ్యం.? అనుకుంటున్నారా.? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా ఊపిరితిత్తుల్లో చేరుకున్న దుమ్ము, ధూళి, కఫం తొలగించేందుకు బాగా సహకరిస్తుంది. అందుకు చేయాల్సిందల్లా.. కొద్దిగా పుదీనా ఆకుల్ని తీసుకుని ఓ గ్లాస్ నీటిలో వేసి మరిగించి.. దానికి కొద్దిగా అల్లం ముక్కను చేర్చి మరగించాలి.
ఆ నీరు చల్లారాక వడకట్టుకుని అందులో కాస్త పసుపు, తేనె కలిపి తాగితే అదే ఊపిరితిత్తులను క్లీన్ చేసే మెడిసెన్. ఇలా వారానికి ఒకసారి.. ఎక్కువగా పొల్యూషన్ ఏరియాల్లో తిరిగే వారు మూడు రోజులకోసారి చేస్తే ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం, దుమ్ము, ధూళి శుభ్రమయిపోతాయ్. యూరిన్ ద్వారా, చెమట ద్వారా అవి బయటికి వచ్చేస్తాయ్.
తద్వారా ఊపిరితిత్తులు ఎలాంటి ఇన్‌ఫెక్షన్లకు గురి కాకుండా ఆరోగ్యంగా వుంటాయ్. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడానికి కూడా ఈ పుదీనా డ్రింక్ యూజ్ అవుతుంది. దీర్ఘ కాలిక దగ్గు, కఫం వేధిస్తున్నా కూడా ఈ పుదీనా జ్యూస్ మంచి పరిష్కారం అవుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com