‘గుంటూరు కారం’ మళ్లీ లీకుల గోల.!
- November 04, 2023
మొదట్నుంచీ ‘గుంటూరు కారం’కి లీకుల బెడద వెంటాడుతూనే వుంది. మహేష్ బాబు లుక్స్ అధికారికంగా రిలీజ్ చేయకుండానే లీక్ అయిపోయాయ్. అలాగే, ఆ సీన్ అది అట.. ఈ సీన్ ఇది అట.. అంటూ లీకులు. హీరోయిన్ విషయంలోనూ మొదట లీకులొచ్చి.. తర్వాత అనౌన్స్‌మెంట్లు వచ్చాయ్.
తాజాగా ఫస్ట్ సింగిల్ బిట్ కూడా లీక్ అయిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించి ఓ సాంగ్ బిట్ హల్ చల్ చేసింది. అయితే, రెప్పపాటులోనే అలర్ట్ అయ్యింది ‘గుంటూరు కారం’ టీమ్. ఆ లీకును తొలగించే ప్రయత్నం చేసింది . కానీ, అప్పటికే ఆ లీకుల లింకులు స్వైర విహారం చేసేశాయ్.
దాంతో, త్వరలోనే ఈ సాంగ్ బిట్‌ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. బహుశా రేపో మాపో రిలీజ్ కావచ్చు. ప్రస్తుతం సినిమాలో ప్రధాన తారాగణంలో ఒకరైన రమ్యకృష్ణపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. అలాగే, జయరామ్ కాంబినేషన్‌లోనూ కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.
ఈ సినిమాతో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మహేష్ బాబు హ్యాట్రిక్ మూవీ ఇది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







