బాబీ-బాలయ్య మొదలెట్టేదెప్పుడంటే.!
- November 04, 2023
‘వాల్తేర్ వీరయ్య’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు బాబీ. ఆ తర్వాత నందమూరి హీరో బాలయ్యతో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. అనిల్ రావిపూడితో ‘భగవంత్ కేసరి’ పూర్తి చేశాక ఆ సినిమాని పట్టాలెక్కించేయాలనుకున్నాడు.
ఆ టైమ్ రానే వచ్చింది. ఇటీవలే ‘భగవంత్ కేసరి’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాల్ని అందుకుందా.? లేదా.? అనే సంగతి అటుంచితే, హిట్టు ట్యాగ్‌తో సినిమా అయితే రన్ అయిపోతోంది.
గ్యాప్ తీసుకోకుండా సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ పోతున్నారు ఈ మధ్య బాలయ్య. ఆ క్రమంలోనే కమిట్ అయిన బాబీ సినిమాని పట్టాలెక్కించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారనీ తెలుస్తోంది.
ఈ నెల 6 నుంచి సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఓ భీభత్సమైన ఫైట్ సీన్‌తో సినిమా స్టార్ట్ చేయనున్నారట. బాలయ్య సినిమాల్లో వుండాల్సిన కంపల్సరీ ఎలిమెంట్లు.. మాస్‌ని ఉర్రూతలూగించే సిగ్నేచర్ డైలాగులు.. దద్దరిల్లిపోయే ఫైట్ సన్నివేశాలూ.. ఆ ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా ఈ సినిమాలో చూపించబోతున్నాడట బాబీ.
మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేర్ వీరయ్య’ హిట్టు కొట్టాడు. మరి, బాలయ్యతో ఎలాంటి హిట్టు కొడతాడో చూడాలిక.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







