తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సేవలు
- May 24, 2016
వచ్చే నెల తిరుపతి విమానాశ్రయం నుంచి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఇంధన, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. న్యూఢిల్లీ మీదుగా దుబాయ్, అమెరికా, మధ్య తూర్పు దేశాలకు సర్వీసులకు ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఎఐ) ఆమోదం తెలిపిందన్నారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్టోబర్లో విజయవాడ (గన్నవరం) విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులను నడపనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ప్రయాణికుల సంఖ్య పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని అన్ని విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేశంలో విమాన ప్రయాణికుల వృద్ధిరేటు 17శాతం ఉండగా రాష్ట్రంలో 61 శాతం ఉందన్నారు. తిరుపతిలో 48 శాతం, రాజమండ్రిలో 44 శాతం, విశాఖలో 64 శాతం, విజయవాడలో 69 శాతం వృద్ధి రేటు నమోదైందన్నారు. తిరుపతిలో కొత్త టెర్మినల్ అందుబాటులోకి వచ్చిందని, రాజమండ్రిలో టెర్మినల్ విస్తరణ పనులు చేపట్టనున్నామని పేర్కొన్నారు. కడప నుంచి విజయవాడకు విమాన సర్వీసులు నడుపుతున్నట్టు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని, అది అందుబాటులోకి వస్తే విశాఖ విమానాశ్రయం మూసివేస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







