ఎలక్ట్రికల్ కేబుల్స్ చోరీ.. ఇద్దరు ఆసియన్లు అరెస్ట్
- November 07, 2023
కువైట్: ఎలక్ట్రికల్ కేబుల్స్ దొంగిలించే ఆసియా ప్రవాసుల ముఠాను జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. గత కొన్ని నెలల్లో జహ్రా గవర్నరేట్ పరిసర ఎడారి ప్రాంతాల్లో ఒక ముఠా ఎలక్ట్రికల్ కేబుళ్లను దొంగిలించిన సుమారు 30 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను అనుసరించేందుకు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం భద్రతా బృందాన్ని ఏర్పాటు చేసింది. అమ్ఘరా స్క్రాప్ షాపుల్లో ఇద్దరు ఆసియన్లు కొత్త మరియు ఉపయోగించిన ఎలక్ట్రికల్ కేబుళ్లను తరచుగా విక్రయిస్తున్నట్లు నివేదికలు రావడంతో.. బృందం నిందితులను పట్టుకోగలిగిందన్నారు. ఆర్థిక లబ్ధి కోసం విద్యుత్ స్తంభాలను లాగి పడేయడం, విద్యుత్ తీగలను కత్తిరించి విక్రయించడం వంటి పనులకు పాల్పడుతున్నట్లు విచారణలో నిందితులు అంగీకరించారు.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!