సౌదీ లో పెట్టుబడిదారులకు వ్యాపార వీసా రుసుము మినహాయింపు
- November 08, 2023
రియాద్: సౌదీ అరేబియా వ్యాపార సందర్శన వీసా రుసుము చెల్లింపు నుండి దౌత్యపరమైన లేదా ప్రత్యేక పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న పెట్టుబడిదారులకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే పెట్టుబడిదారులకు దౌత్యవేత్తలుగా అధికారిక హోదా ఉండదనే షరతు విధించారు. సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOFA), పెట్టుబడి మంత్రిత్వ శాఖ (MISA) సహకారంతో "విజిటింగ్ ఇన్వెస్టర్" పేరుతో ఎలక్ట్రానిక్ బిజినెస్ విజిట్ వీసాల జారీ రెండవ దశను సోమవారం ప్రారంభించింది. గత జూన్‌లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పెట్టుబడి మంత్రిత్వ శాఖ సహకారంతో యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా మరియు ఓషియానియాలోని అనేక దేశాల పౌరులుగా ఉన్న పెట్టుబడిదారుల కోసం వ్యాపార సందర్శన వీసా యొక్క మొదటి దశను ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







