'నాకు నా కాళ్లు వెనక్కి కావాలి': గాజా యుద్ధంలో అంగవైకల్యం పొందిన చిన్నారులు
- November 08, 2023
యూఏఈ: ఇజ్రాయెల్ -హమాస్ యుద్ధంలో భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరుగుతుంది. అనేక మంది అవయవాలను కోల్పోయి వికలాంగులుగా మిగులుతున్నారు. గాజకు చెందిన లాయన్ అల్-బాజ్ తన కాళ్లు తీసివేసిన తర్వాత బాధతో ఏడుస్తుంది. 'నాకు నా కాళ్లు వెనక్కి కావాలి' అని 13 ఏళ్ల పాలస్తీనియన్ దక్షిణ గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యునిస్ నాజర్ ఆసుపత్రిలో మీడియా ముందు విలపించడం అందరిని కలిచి వేసింది. పేదరికంలో ఉన్న పాలస్తీనా భూభాగం, సంవత్సరాల తరబడి ఇజ్రాయెల్ నేతృత్వంలోని దిగ్బంధనంలో ఉంది. అక్టోబర్ 7 న యుద్ధం చెలరేగినప్పటి నుండి ఇజ్రాయెల్ సైన్యం ముట్టడి కారణంగా ఆహారం, నీరు మరియు ఇంధనం కొరతను ఎదుర్కొంటుంది. అదే సమయంలో వైద్య సదుపాయాలు నాశనం అయ్యాయి. అందుబాటులో ఉన్న వైద్య సామాగ్రి చాలా తక్కువగా ఉంది.హమాస్ ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. యుద్ధం చెలరేగినప్పటి నుండి గాజాలో 10,328 మంది మరణించారు. వీరిలో 4,000 మందికి పైగా పిల్లలు ఉన్నారు. బాలుడి ఇంటిపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో తన ఇద్దరు అక్కలను, ఒక తమ్ముడిని కోల్పోయింది. తాను కృత్రిమ కాలును పొందిన తర్వాత చదువును కొనసాగిస్తానని, తద్వారా డాక్టర్ కావాలనే తన కలను సాధించగలనని, తన కుటుంబానికి అండగా ఉంటానని అశాభావం వ్యక్టం చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







