బద్రీనాథ్ ఆలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రార్థనలు
- November 08, 2023
బద్రినాథ్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లాలోని బద్రినాథ్ ఆలయాన్నిసందర్శించారు. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో అక్కడికి చేరుకున్న రాష్ట్రపతికి ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, బద్రినాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో రాష్ట్రపతి 25 నిమిషాల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనం అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ అజయ్.. రాష్ట్రపతికి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఇక సీఎం ధామీ ఆలయ ప్రతిరూపాన్ని బహూకరించారు. ఆలయ సందర్శన అనంతరం రాష్ట్రపతి శ్రీనగర్ బయలుదేరి వెళ్లారు. అక్కడ హెచ్ఎన్బీ గర్వాల్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







