సూపర్ సీట్ సెల్: Dh1 కే మనీలాకు!
- November 09, 2023
దుబాయ్: యూఏఈ లోని ఫిలిపినో నివాసితులు వచ్చే ఏడాది స్వదేశానికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.. ఇప్పుడు విమానాన్ని బుక్ చేసుకునే సమయం వచ్చింది. బడ్జెట్ క్యారియర్ సెబు పసిఫిక్ (Cebu Pacific )బుధవారం నాడు Dh1కి వన్-వే ట్రిప్పులను అందిస్తూ సూపర్ సీట్ల విక్రయాన్ని ప్రారంభించింది. ఏప్రిల్ 1 నుండి అక్టోబర్ 31, 2024 వరకు షెడ్యూల్ చేయబడిన వన్-వే దుబాయ్-మనీలా విమానాలకు Dh1 బేస్ ఫేర్ వర్తిస్తుంది. అయితే, ప్రత్యేక ధరను పొందడానికి ప్రయాణికులు బుధవారం (నవంబర్ 8) నుండి నవంబర్ 14 వరకు బుక్ చేసుకోవాల్సి ఉంటుందని ఎయిర్‌లైన్ తెలిపింది. నవంబరు 11న సెబు పసిఫిక్ పెద్ద "పిసో ఫేర్" ప్రచారంలో భాగంగా అల్ట్రా-చౌక విమాన సీట్లు అందుబాటులోకి వస్తాయి. బోరాకే ద్వీపం, బోహోల్ వంటి ఇతర స్థానిక గమ్యస్థానాలకు వెళ్లాలనుకునే ఫిలిపినోలు కేవలం Php1 (7 fils)కి మాత్రమే సీటు పొందవచ్చు. బడ్జెట్ క్యారియర్ సెబు ప్రస్తుతం 35 ఫిలిప్పీన్స్, 25 అంతర్జాతీయ గమ్యస్థానాలకు సేవలు అందిస్తోంది.
తాజా వార్తలు
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!







