గాజాకు మద్దతుగా.. అబుదాబి, అజ్మాన్‌లో విరాళాల డ్రైవ్
- November 09, 2023
యూఏఈ: యుద్ధంతో దెబ్బతిన్న గాజాలో ఉన్న పాలస్తీనియన్లకు సహాయం చేయాలనుకునే యూఏఈ నివాసితులు అజ్మాన్, అబుదాబిలో షెడ్యూల్ చేయబడిన రెండు కొత్త ఈవెంట్లలో సహాయక చర్యలకు స్వచ్ఛందంగా తరలిరావచ్చు. తారాహుమ్ ఫర్ గాజా (గాజా కోసం కరుణ) ప్రచారం నవంబర్ 9న అజ్మాన్‌లో.. నవంబర్ 12న యూఏఈ రాజధానిలో బుధవారం ప్రకటించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (మోఫా) మరియు ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ అథారిటీ పర్యవేక్షణలో ఈ ప్రచారం నిర్వహిస్తున్నారు.
రెండు 'కంపాషన్ ఫర్ గాజా' ఈవెంట్ల వివరాలు:
అజ్మాన్: నవంబర్ 9, ఎమిరేట్స్ హాస్పిటాలిటీ హాల్
అబుదాబి: నవంబర్ 12, మినా జాయెద్, అబుదాబి పోర్ట్స్ హాల్, ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు
యూఏఈ ప్రెసిడెంట్, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇటీవలే ఆపరేషన్ గాలంట్ నైట్ 3ని ప్రారంభించాలని ఆదేశించారు. గాజా స్ట్రిప్‌లో ఫీల్డ్ హాస్పిటల్ ఏర్పాటు చేయనున్నారు. వైద్య చికిత్స కోసం 1,000 మంది పాలస్తీనా పిల్లలను యూఏఈకి తీసుకురావాలని కూడా ఆయన ఆదేశించారు. గాజాకు మద్దుతుగా దేశంలోని అధీకృత స్వచ్ఛంద సంస్థలు మరియు మానవతా సంస్థల ద్వారా కూడా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







