మళ్లీ భయపెట్టేస్తోన్న ప్రబాస్.!
- November 09, 2023
డిశంబర్ 22న ఏది ఏమైనా ‘సలార్’ రిలీజ్ చేసి తీరతామని నిర్మాతలు చెబుతున్నారు. తాజాగా ‘సలార్’పై ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. అదేమంటే, ‘సలార్’కి కత్తెరలు పడుతున్నాయంటూ.
మొదట ‘సలార్’ని రెండు పార్టులుగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, ఇప్పుడేమో.. ఒకటే పార్ట్‌గా రిలీజ్ చేయాలనుకుంటున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయ్.
రెండో పార్ట్‌ని కూడా మొదటి పార్ట్‌కి కలిపేసి అంతా ఒక్కటే సినిమాగా రిలీజ్ చేయాలనుకుంటున్నారట.. అనేది ఓ గాసిప్ అయితే, లేదు లేదు మొదటి పార్ట్‌లోనే కొన్ని సీన్లు కత్తిరించేస్తున్నారంటూ ప్రచారం ఇంకో వైపు గుప్పుమంటోంది.
గ్రాఫిక్స్ వర్క్ విషయంలో నెలకొన్న అలజడే ఇందుకు కారణం అని మాట్లాడుకుంటున్నారు. ప్రబాస్‌కి ‘సలార్’ చాలా చాలా ప్రెస్టీజియస్ మూవీ. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కి కూడా.
ఈ సినిమా రిజల్ట్ పైనే తదుపరి ఎన్టీయార్‌తో చేయబోయే సినిమా ఆధారపడి వుంటుంది. అందుకే ఈ సినిమా విషయంలో అటు దర్శక, నిర్మాతల్లోనూ ఇటు ప్రబాస్ ఫ్యాన్స్‌లోనూ కూడా తెలియని ఆందోళన.
ఎన్ని ప్రచారాలు గుమ్మెత్తినా.. అవన్నీ రిలీజ్ అయ్యేంతవరకే. ఒక్కసారి సినిమా రిలీజ్ అయితే, గాసిప్స్ అన్నింటికీ చెక్ పడిపోయినట్లే. చూడాలి మరి, ఏం జరుగుతుందో.!
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







