సమంతకి ఏమైంది.? ఎందుకలా చేస్తోంది.?
- November 09, 2023
‘ఖుషి’ సినిమాతో ఇటీవల సమంత ప్రేక్షకుల ముందుకొచ్చింది. మయోసైటిస్ వ్యాధి కారణంగా అనారోగ్యం బారిన పడిన సమంత ఇకపై సినిమాల్లో నటించదంటూ ఆ మధ్య ఓ వార్త హల్ చల్ చేసింది.
ఆ తర్వాతే ఎలాగోలా ‘ఖుషి’ పూర్తి చేసింది. సమంత అనారోగ్య సమస్యను ఓ పబ్లిసిటీ ఎలిమెంట్‌గా తీసుకుని ఈ సినిమాని ప్రమోట్ చేశారు.. అది వర్కవుట్ కాలేదనుకోండి.
ఈ సినిమా తర్వాతే సమంత నుంచి సినిమాలకు బ్రేక్ అన్న షాకింగ్ డెసిషన్ వినిపించింది. అయితే అది తాత్కాలికమైన బ్రేక్ మాత్రమే అన్నారనుకోండి.
ఇప్పుడేమో.. సమంత చేస్తున్న పని అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. ఈ మధ్య హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. తాజాగా ఓ మ్యాగజైన్ కోసం బికినీ పోజులతో మతులు పోగొడుతోంది సమంత.
ఓ పక్క సినిమాలకు బ్రేకిచ్చానంటోంది. మరోపక్క ఏంటింతలా స్కిన్ షో చేస్తోంది.. అంటూ సమంతను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
మరోవైపు తమిళంలో ఓ క్రేజీ ఆఫర్ సమంత కోసం వెయిట్ చేస్తోందన్న ప్రచారం కూడా వుంది. ఏది ఏమైనా సమంత తనకున్న క్రేజ్‌ని ఏమాత్రం వృధా చేయకుండా వున్నంతలో వాడేసుకుంటోంది.
సినిమాలు చేయకుంటే మాత్రం ఈ రకంగా వచ్చే పబ్లిసిటీ సమంతను సినీ జనానికి దగ్గరగానే వుంచుతోందనుకోవాలి. అందుకోసమే సమంత ఇలా చేస్తోందేమో.!
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







