పవన్ డైరెక్టర్లలో గుబులు.! కారణం అదేనా.?
- November 09, 2023
పవన్ కళ్యాణ్ తో ప్రస్తుతం ముగ్గురు డైరెక్టర్లు పని చేస్తున్నారు. వారిలో హరీష్ శంకర్ ఒకడు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నాడు హరీష్ శంకర్. ఈ సినిమాపై అనేక రకాల రూమర్లు. సోషల్ మీడియాలో రోజుకో న్యూస్ చక్కర్లు కొడుతూనే వుంది. వాటిని ఖండిస్తూ ఎలాగోలా మ్యానేజ్ చేసుకుంటూ వస్తున్నాడు హరీష్.
అయితే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా స్టేటస్ మాత్రం చెప్పలేకపోతున్నాడు క్లారిటీగా. అదలా వుంటే, సుజిత్‌ది ఇంకో ప్రాబ్లమ్. ‘ఓజీ’ అయిపోయిందంటున్నారు. షూటింగ్ ఇంకా పెండింగ్ వుందంటున్నారు. హరీష్, సుజిత్ పరిస్థితి ఇలా వుంటే, క్రిష్‌ది మరో సమస్య.
అప్పుడెప్పుడో స్టార్ట్ చేశారు ‘హరి హరవీరమల్లు’ సినిమాని. చకచకా సినిమా షూటింగ్ చేశారు. కానీ, ఓ కొలిక్కి వచ్చింది లేదింతవరకూ. చాన్నాళ్ల క్రితమే టీజర్ రిలీజ్ చేశారు. కానీ, ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించి నో అప్డేట్. ఇప్పుడయితే మొత్తానికి సినిమా ఆగిపోయిందంటున్నారు. డైరెక్టర్‌తో పవన్ కళ్యాణ్‌కి పొసగడం లేదన్న ప్రచారం కూడా వుంది.
ఇదిలా వుంటే, అసలు సిసలు సమస్య ఎలక్షన్లు దగ్గరకొచ్చేయడం. ఇప్పటికే ఎలక్షన్ హీట్ పెరిగిపోయింది. దాంతో, పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమాల విషయంలో డైరెక్టర్లు మల్లగుల్లాలు పడుతున్నారట. ఎటూ మింగలేక, కక్కలేక అన్న చందంగా వుంది వీరి పరిస్థితి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







