దుబాయ్ లో డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ తప్పు అస్సలు చేయొద్దు..
- November 11, 2023
దుబాయ్: దుబాయ్ లో ట్రాఫిక్ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయనే విషయం తెలిసిందే.రోడ్డు ప్రమాదాల నివారణకు అక్కడి ట్రాఫిక్ విభాగం ఇలా కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. అందుకే ఆ దేశాల్లో రోడ్డు ప్రమాదాలు చాలా తక్కువగా సంభవిస్తుంటాయి. నివాసితులు, దేశ పౌరులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే. లేనిపక్షంలో భారీ జరిమానాలు, బ్లాక్ పాయింట్స్ వేయడం జరుగుతుంది. అలాగే ట్రాఫిక్ అధికారులు వాహనం కూడా జప్తు చేస్తారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దుబాయి ట్రాఫిక్ పోలీసులు ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్న ఒక కీలక అంశానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. అదేంటంటే.. అనుమతిలేని చోట వాహనాలను 'యూటర్న్' చేయడం.
ఇలా నిషేధిత ప్రాంతాల వద్ద ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ వాహనాలను యూటర్న్ చేయడంతో తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దుబాయి పోలీస్ విభాగానికి చెందిన స్మార్ట్ ట్రాఫిక్ వ్యవస్థ ఈ విషయాన్ని బయటపెట్టింది. దాంతో ఈ విషయాన్ని ఇకపై ఉపేక్షించేది లేదని ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ఈ ఉల్లంఘనకు గాను 500 దిర్హాములు జరిమానా, 4 బ్లాక్‌పాయింట్స్ వేయడం జరుగుతుందని తెలిపారు. ఇలా అనుమతిలేని చోట్లలో యూటర్న్ చేయడం వల్ల గత 10నెలల్లో ఏకంగా 29,463 ప్రమాదాలు జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనల కారణంగా ఆరు మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. సో.. ఇకపై ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా నివారించడంలో భాగంగా కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వాహనదారులను ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని దుబాయ్ పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!







