దుబాయ్ వాహనదారులు హెచ్చరిక: సైక్లింగ్ ఈవెంట్ కోసం షేక్ జాయెద్ రోడ్ మూసివేత
- November 11, 2023
దుబాయ్: వార్షిక దుబాయ్ రైడ్ సైక్లింగ్ ఈవెంట్ కోసం సైక్లిస్టులు దుబాయ్ ఐకానిక్ హైవేని నవంబర్ 12న(ఆదివారం) ఉదయం ట్రేడ్ సెంటర్ రౌండ్అబౌట్ నుండి సఫా పార్క్ ఇంటర్‌ఛేంజ్ (2వ ఇంటర్చేంజ్) వరకు రెండు దిశలలో షేక్ జాయెద్ రోడ్‌లోని కొంత భాగం వెంబడి కార్లు అనుమతించబడవు. దిగువ ఫైనాన్షియల్ సెంటర్ స్ట్రీట్, ట్రేడ్ సెంటర్ స్ట్రీట్ కూడా ట్రాఫిక్‌కు మూసివేయబడింది. ఐదు గంటలపాటు( ఉదయం 4 నుండి ఉదయం 9 గంటల వరకు ) మూసివేయనున్నారు. దుబాయ్ రైడ్ ఉదయం 6.15 నుండి 8.15 వరకు ఉంటుంది. వాహనదారులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) సూచించింది. అల్ హదికా స్ట్రీట్, అల్ వాస్ల్ స్ట్రీట్, అల్ ఖైల్ రోడ్, అల్ మైదాన్ స్ట్రీట్, అల్ అసయెల్ స్ట్రీట్, 2వ జాబీల్ స్ట్రీట్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని ట్వీట్ చేసింది.
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ 2017లో ప్రారంభించిన దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ (DFC) ఫ్లాగ్షిప్ ఈవెంట్లలో దుబాయ్ రైడ్ ఒకటి. ఇది మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్, దుబాయ్ వాటర్ కెనాల్, బుర్జ్ ఖలీఫా మరియు షేక్ జాయెద్ రోడ్ మరియు డౌన్‌టౌన్ దుబాయ్‌లోని ఇతర ఆకర్షణలతో సహా అన్ని నైపుణ్య స్థాయిల రైడర్లకు అనువైన రెండు సైక్లింగ్ మార్గాలను ఏర్పాటు చేశారు. గత సంవత్సరం దుబాయ్ రైడ్ ఎడిషన్‌లో 34,897 మంది సైక్లిస్టులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







