కువైట్ లో జాతీయ ఆరోగ్య వ్యవస్థ బలోపేతం
- November 11, 2023
కువైట్: జాతీయ ఆరోగ్య వ్యవస్థను కువైట్ బలోపేతం చేయనుంది. ముఖ్యంగా అత్యవసర వైద్య సేవలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా, 2024 నాటికి కొత్తగా కొనుగోలు చేసిన 80 అంబులెన్స్‌లు సేవలో ఉంటాయని ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవధి తెలిపారు. అల్-ముత్లా ప్రాంతంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి ప్రసంగించారు. ఈ కేంద్రం ఆరు అంబులెన్స్‌లు, ఆరుగురు టెక్నీషియన్ల సామర్థ్యంతో పనిచేస్తుందన్నారు. అల్-జహ్రా మెడికల్ ఏరియా మరియు కొత్త జహ్రా ఆసుపత్రికి మద్దతుగా 24 గంటలూ పని చేస్తుందని, నాలుగు కొత్త వైద్య కేంద్రాలను ప్రారంభించబోతున్నామని డాక్టర్ అల్-అవధి వివరించారు. దాదాపు 28,000 రెసిడెన్షియల్ ప్లాట్లు ఉన్న వైద్యరంగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నామని మంత్రి చెప్పారు.
ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీసెస్ చీఫ్ డాక్టర్ అహ్మద్ అల్-షట్టి మాట్లాడుతూ.. అభివృద్ధి విస్తరణ ప్రణాళికలో భాగంగా ఒక సంవత్సరంలోనే తొమ్మిది అత్యవసర ప్రతిస్పందన కేంద్రాలను ప్రారంభించామని, మొత్తం 86 కేంద్రాలకు చేరుకుందని పేర్కొన్నారు. వేగవంతమైన ప్రతిస్పందనను అందించడానికి, అల్-అబ్దాలీ రహదారికి కూడా కేంద్రం సేవలను విస్తరిస్తుందన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







