హరీష్ శంకర్ డైరెక్షన్ లో మరో సారి పవన్ కళ్యాణ్..
- May 25, 2016
దాదాపు పుష్కర కాలం పాటు ఒక్క హిట్ కూడా లేని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తిరిగి ఫాంలోకి తీసుకు వచ్చిన సినిమా గబ్బర్ సింగ్. పవన్ మార్కెట్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన ఈ సినిమాతో దర్శకుడు హరీష్ శంకర్ కూడా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కానీ తరువాత చేసిన రామయ్య వస్తారవయ్య డిజాస్టర్ కావటంతో సీన్ రివర్స్ అయ్యింది. హరీష్ కి అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.రామయ్య వస్తావయ్య ఫ్లాప్ తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న హరీష్, సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో సక్సెస్ సాధించాడు. అదే జోరులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఏజె సూర్య దర్శకత్వంలో హుషారు(వర్కింగ్ టైటిల్) లో నటిస్తున్న పవన్, ఆ తరువాత దాసరి నిర్మాతగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడు.ఈ సినిమాతో పాటు తనకు ఖుషి లాంటి సూపర్ హిట్ సినిమా అందించిన ఏఎం రత్నం బ్యానర్ లో సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ సినిమాను హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు రత్నం. ఇప్పటికే పవర్ స్టార్ కోసం ఓ లైన్ వినిపించిన హరీష్, ప్రస్తుతం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







