ముగిసిన నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు
- November 13, 2023
హైదరాబాద్: సీనియర్ నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు ముగిశాయి. చంద్రమోహన్ తీవ్ర అనారోగ్యం కారణంగా నవంబరు 11న నాడు కన్నుమూశారు. అమెరికాలో ఉన్న పెద్ద కుమార్తె నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో నేడు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఉదయం హైదరాబాద్ ఫిలింనగర్ లోని ఆయన నివాసం నుంచి పంజాగుట్ట శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర జరిగింది. అశ్రునయనాల మధ్య ఆయన అంతిమ సంస్కారాలు ముగిశాయి. చంద్రమోహన్ సోదరుడు దుర్గాప్రసాద్ అంతిమ సంస్కారాలు జరిపారు. చంద్రమోహన్ భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు కడసారి నివాళులు అర్పించారు.
కాగా, చంద్రమోహన్ కు గతంలో బైపాస్ సర్జరీ జరిగింది. హృద్రోగంతో పాటు కిడ్నీ సంబంధ సమస్య కూడా తలెత్తడంతో ఆయన కోలుకోలేకపోయారు. శనివారం నాడు తన నివాసంలో సొమ్మసిల్లి పడిపోయిన ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







