యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రం రహదారి..
- May 25, 2016
సేతు, అభిషేక్, రాజ్, పూజ, ఉమాశంకర్, శ్వేత, విజయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రం రహదారి. యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైన్ మెంట్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్ బ్యానర్ పై రాజ్ జకారిస్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. సురేష్ కుమార్ మరియు రాజ్ డైరెక్టర్స్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. రాహుల్ రాజ్ అద్భుతమైన సంగీతమందించారు. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల్లో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేగా ఈ చిత్రాన్ని మలిచారు. అనిల్ అరసు యాక్షన్ ఎపిసోడ్స్ అబ్బుర పరుస్తాయని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. కిషోర్ మణి అద్భుతమైన విజువల్స్ తో కథకు రిచ్ నెస్ తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. యాక్షన్ థ్రిల్లర్ తరహా కథలకు మన దగ్గర డిమాండ్ ఎక్కువ. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రాల్ని ఆదరిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్టుగా రహదారి పేరుతో మేం రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని ఈనెలమెదటి వారంలో విడుదల చేద్దామనుకున్నాం కాని మహెష్బాబు నటించిన బ్రహ్మోత్సవం చిత్రం విడుదలవుతున్న సంధర్బంలో ధియోటర్స్ ప్రాబ్లం వలన విడుదల చేయలేకపోయాం. ఇప్పడు మాకు ధియటర్స్ నుండి పర్మిషన్స్ రావటంతో 27న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాం. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. రాహుల్ రాజ్ అద్భుతమైన పాటలందించారు. ప్రతీ పాటకు చిత్రంలో ఇంపార్టెన్స్ ఉంటుంది. డైరెక్టర్ స్క్రీన్ ప్లేను అద్భుతంగా మలిచారు. అనిల్ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. అని అన్నారు.
డిఓపి - కిషోర్ మణి మ్యూజిక్ - రాహుల్ రాజ్ ఎడిటర్ - విటి విజయన్ యాక్షన్ - అనిల్ అరసు నిర్మాత - రాజ్ జకారిస్ డైరెక్టర్స్ - సురేష్ కుమార్ మరియు రాజ్
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







