'సాహసం శ్వాసగా సాగిపో'.చిత్రంలో'చకోరి' అనే పాట విడుదల..
- May 25, 2016
నాగచైతన్య కథానాయకుడిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ రూపొందిస్తున్న చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. కోన వెంకట్ సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్. రెహమాన్ స్వరాలు కూరుస్తున్నారు. నాగచైతన్య జోడీగా మంజిమా మోహన్ నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల 'ఎల్లిపోమాకే.. ఎదనే వదిలి పోమాకే' పాటను, 'షోకిల్లా' సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. గురువారం (26న) 'చకోరి' అనే పాటను సోషల్ మీడియాలో విడుదల చేయనున్నారు.
ఈ విషయాన్ని చిత్ర సమర్పకుడు కోన వెంకట్ తెలియజేస్తూ ''మ్యూజికల్‌గా ఈ చిత్రం చాలా పెద్ద స్థాయికి వెళ్లబోతోంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు అందర్నీ అలరిస్తున్నాయి. గురువారం నాగచైతన్య, నేను 'చకోరి' పాటను ట్విట్టర్‌లో విడుదల చేస్తున్నాం. అదే రోజు ఆడియో విడుదల తేదీని, సినిమా విడుదల తేదీని గౌతమ్‌మీనన ప్రకటిస్తారు. వైజాగ్ నుంచి కన్యాకుమారి వరకు హీరో హీరోయినలు బైక్‌పై ప్రయాణిస్తున్నప్పుడు వచ్చే ఈ పాట సినిమాకి హైలైట్ అవుతుంది'' అన్నారు.
గౌతమ్ వాసుదేవ మీనన మాట్లాడుతూ ''ఈ చిత్రంలో నాగచైతన్య లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. తన క్యారెక్టర్‌ని చాలా బాగా చేశాడు. రెహమాన్ అద్భుతమైన పాటల్ని చేశారు. మా ముగ్గురి కాంబినేషన్‌లో ఇది మరో మ్యూజికల్ హిట్టవుతుంది'' అని చెప్పారు. 'ఎల్లిపోమాకే.. ఎదనే వదిలి పోమాకే' పాటను యూట్యూబ్‌లో నాలుగు మిలియన్ల మంది చూడటం సంతోషాన్నిచ్చిందని నిర్మాత రవీందర్‌రెడ్డి తెలిపారు.
ఈ చిత్రానికి రచన: కోన వెంకట్, ఛాయాగ్రహణం: డానమాక్ ఆర్థర్, కూర్పు: ఆంటోని, కళ: రాజీవన, ఫైట్స్: సిల్వ, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ మీనన్.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







