అవసరాల శ్రీనివాస్ నాని కాంబినేషన్ లో ..
- May 25, 2016
'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో దర్శకుడిగా మెప్పించిన నటుడు అవసరాల శ్రీనివాస్. ప్రస్తుతం 'జ్యో అచ్యుతానంద' పేరుతో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాని హీరోగా ఓ సినిమా డైరెక్ట్ చేయబోతున్నాడట శ్రీనివాస్. ఈ విషయాన్ని హీరో నానినే స్వయంగా తెలియజేశాడు. రీసెంట్‌గా జరిగిన 'జెంటిల్‌మన్' ఆడియో వేడుకలో దీన్ని కన్ఫమ్ చేశాడు. నిజానికి వీరిద్దరూ ఒకేసారి తమ నటనా ప్రస్థానం ప్రారంభించారు. "అష్టా-చమ్మా" సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ ఇద్దరిలో నాని హీరోగా సక్సెస్ అయితే.. అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాక దర్శకుడిగానూ బిజీ అయ్యాడు. "పిల్ల జమిందార్", "ఎవడే సుబ్రహ్మణ్యం", "జెంటిల్ మన్" చిత్రాల్లోనూ కలిసి నటించిన వీరిద్దరూ... త్వరలో మరోసారి కలసి వర్క్ చేయబోతున్నారు. అయితే ఒకరు దర్శకులుగా మరొకరు హీరోగా..! మరి ఈ ఇద్దరి కలయికలో ఎలాంటి చిత్రం రానుందో చూడాలి..!
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







