'చారి 111'గా 'వెన్నెల' కిశోర్ ఫస్ట్ లుక్...
- November 14, 2023
హైదరాబాద్: 'వెన్నెల' కిశోర్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'చారి 111'. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ హీరోగా నటించిన హిట్ సినిమా 'మళ్ళీ మొదలైంది' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. సంయుక్తా విశ్వనాథన్ కథానాయిక. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
'చారి 111' కాన్సెప్ట్ టీజర్ సినిమా అనౌన్స్ చేసినప్పుడు విడుదల చేశారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే సిటీకి ప్రమాదం రావడం ఆ కేసును పరిష్కరించడానికి కన్ ఫ్యూజ్డ్ స్పై చారి (వెన్నెల కిశోర్) వస్తారు. ఆ కేసును చారి ఎలా సాల్వ్ చేశాడనేది సినిమాగా తెలుస్తుంది. ఈ రోజు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే... 'వెన్నెల' కిశోర్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించారు. హీరోయిన్ సంయుక్తా విశ్వనాథ్ గ్లామర్ అండ్ యాక్షన్ ఓరియెంటెడ్ రోల్ చేస్తున్నట్లు అర్థం అవుతోంది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే యాక్షన్ సినిమాగా రూపొందుతున్న 'చారి 111'లో ఓ సీరియస్ కాన్ ఫ్లిక్ట్ కూడా ఉండబోతుంది.
'చారి 111' ఫస్ట్ లుక్ పోస్టర్లో వెన్నెల కిశోర్, సంయుక్తా విశ్వనాథన్ వెనుక చూస్తే ఛార్మినార్ కనబడుతోంది. హైదరాబాద్ సిటీ నేపథ్యం కథ అని తెలుస్తోంది. ఇంకా బాంబు బ్లాస్ట్ దృశ్యాలు, స్టైలిష్ కార్ కూడా ఉన్నాయి. అసలు కథ ఏమిటనేది తెలియడానికి మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి.
చిత్ర దర్శకుడు టీజీ కీర్తి కుమార్ మాట్లాడుతూ ''ఇదొక స్పై యాక్షన్ కామెడీ సినిమా. సిల్లీ మిస్టేక్స్ చేసే కన్ ఫ్యూజ్డ్ స్పై 'వెన్నెల' కిశోర్ ఓ పెద్ద కేసును ఎలా సాల్వ్ చేశాడనేది సినిమాలో చూడాలి. గూఢచారి సంస్థ హెడ్‌గా కథలో కీలకమైన పాత్రలో మురళీ శర్మ కనిపిస్తారు'' అని చెప్పారు.
చిత్ర నిర్మాత అదితి సోనీ మాట్లాడుతూ ''స్పై జానర్ సినిమాల్లో 'చారి 111' కొత్తగా ఉంటుంది. 'వెన్నెల' కిశోర్ గారి నటన, టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం సినిమాకు హైలైట్ అవుతాయి. చిత్రీకరణ పూర్తి అయ్యింది. ఈ రోజు విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అందుకుంటోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం'' అని చెప్పారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా 'చారి 111' పాటలు విడుదల కానున్నాయి.
'వెన్నెల' కిశోర్, సంయుక్తా విశ్వనాథన్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి, 'తాగుబోతు' రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఎడిటింగ్ : రిచర్డ్ కెవిన్ ఎ, స్టంట్స్ : కరుణాకర్, ప్రొడక్షన్ డిజైన్ : అక్షత బి హొసూరు, పీఆర్వో : పులగం చిన్నారాయణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బాలు కొమిరి, సాహిత్యం : సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి, సినిమాటోగ్రఫీ : కషిష్ గ్రోవర్, సంగీతం : సైమన్ కె కింగ్, నిర్మాణ సంస్థ : బర్కత్ స్టూడియోస్, నిర్మాత : అదితి సోనీ, రచన, దర్శకత్వం : టీజీ కీర్తీ కుమార్.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్‌పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్‌కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు







