అయిదేళ్ల చిన్నారి అత్యాచారం కేసు..నిందితుడికి మరణ శిక్ష
- November 14, 2023
కొచ్చి: కేరళలోని అలువలో జరిగిన చిన్నారి కిడ్నాప్, రేప్ కేసులో నిందితుడు అష్ఫక్ ఆలమ్ కు ఎర్నాకుళం పోక్సో కోర్టు మరణశిక్షను విధించింది. ఆ కేసులో జడ్జి కే సోమన్ తన తీర్పును ఈరోజు వెలువరించారు. ప్రాసిక్యూషన్ చేసిన వాదనలను కోర్టు అంగీకరించింది. ఇది అత్యంత అరుదైన కేసు అని, నిందితుడికి ఎటువంటి క్షమ అవసరం లేదని, సమాజానికి అతనో సమస్య అని కోర్టు తెలిపింది. 110 రోజుల పాటు ఆ కేసులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. చిల్డ్రన్స్ డే సందర్భంగా తీర్పును వెల్లడించారు. ఆధారాలను ధ్వంసం చేసినందుకు అష్ఫక్కు అయిదేళ్ల జైలుశిక్ష విధించారు. మైనర్‌కు డ్రగ్స్ ఇచ్చినందుకు మూడేళ్ల శిక్ష, మైనర్‌ను రేప్ చేసినందుకు జీవితకా జైలుశిక్ష, మర్డర్ చేసినందుకు మరణశిక్షను విధిస్తున్నట్లు కోర్టు చెప్పింది. 7,70,000 జరిమానా చెల్లించాలని నిందితుడికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







