యూఏఈలో ప్రపంచంలోనే మొదటి ప్లైయింగ్ కార్ రేసింగ్

- November 14, 2023 , by Maagulf
యూఏఈలో ప్రపంచంలోనే మొదటి ప్లైయింగ్ కార్ రేసింగ్

యూఏఈ: ఏప్రిల్ 2024లో ప్రపంచంలోనే అతిపెద్ద స్వయంప్రతిపత్తమైన కార్ రేసింగ్‌ను నిర్వహించేందుకు యూఏఈ సిద్ధమవుతున్నది. నివాసితులు, రేసింగ్ కార్ల అభిమానులు కూడా ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లయింగ్ కార్ రేస్‌ను త్వరలోనే యూఏఈలో చూడవచ్చు.  మొదటి హైడ్రోజన్-పవర్డ్ ఫ్లయింగ్ రేసింగ్ కార్ ప్రొడ్యూసర్ మాకా ఫ్లైట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్టియన్ పినో సోమవారం మాట్లాడుతూ.. నిజమైన ఫ్లయింగ్ రేసింగ్ కార్ ఛాంపియన్‌షిప్‌ను సృష్టించడం లక్ష్యమన్నారు. ఫ్లయింగ్ కార్ రేసులను హోస్ట్ చేసే దేశాలలో యూఏఈ ప్రథమ స్థానంలో ఉందన్నారు. యూరోపియన్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీదారు ఎయిర్‌బస్ నుండి విడిపోయిన తర్వాత స్వతంత్రంగా పనిచేస్తున్న ఫ్రెంచ్ కంపెనీ, ఈ ఏడాది ప్రారంభంలో CES 2023లో ఫ్లయింగ్ రేసింగ్ కారును ఆవిష్కరించింది. ఫ్లయింగ్ రేసింగ్ కారు ధర $2 మిలియన్ (Dh7.34 మిలియన్),  ఇది గరిష్టంగా గంటకు 250 కిలోమీటర్లు వెళుతుంది. సింగిల్-సీటర్ కారు రేసింగ్ ఛాంపియన్ సమయంలో గ్రౌండ్ లెవెల్ నుండి కేవలం 4-5 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది.  మొదటి రేసులో 8 - 10 మంది పాల్గొనే అవకాశం ఉంది. గత నెలలో దుబాయ్‌లో జరిగిన జిటెక్స్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ సందర్భంగా అబుదాబి మొదటిసారిగా 2024 ఏప్రిల్ 28న స్వయంప్రతిపత్త వాహనాల రేసింగ్‌ను నిర్వహించనుందని, దాదాపు 10 సంస్థలు పోటీలో పాల్గొంటాయని వెల్లడించారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com