టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
- November 14, 2023
తిరుమల: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. మంగళవారం పాలకమండలి సమావేశం తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయాలన్న ప్రభుత్వ జీవో నెం.114 మేరకు అర్హత ఉన్న ఉద్యోగులను టీటీడీలో రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని అలిపిరి వద్ద 23వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని, అయితే, హోమంలో పాల్గొనే భక్తులు వెయ్యి రూపాయలు చెల్లించి టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని భూమన తెలిపారు. టీటీడీలో ప్రతిఒక్క ఉద్యోగికి ఇంటి స్థలాలు కేటాయిస్తామని, ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించిన వడమాల పేట వద్ద గ్రావెల్ రోడ్డు నిర్మాణంకు రూ. 25.67 కోట్లు కేటాయింపు చేస్తున్నట్లు భూమన చెప్పారు. వీటిని తిరిగి ఉద్యోగులు నుంచి రీఎంబర్స్ చేసుకుంటామని అన్నారు.
తిరుపతిలోని రామ్ నగర్ క్వార్టర్స్ అభివృద్ధి పనులకు 6.15 కోట్లు కేటాయింపు. టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా 14వేలు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ. 6,850 చెల్లిస్తామని భూమన చెప్పారు. రూ. 197 కోట్లతో స్విమ్స్ ఆసుపత్రి ఆధునీకరణ పనులు చేయాలని పాలక మండలి నిర్ణయించడం జరిగిందని అన్నారు. ప్రసాదాలు, ముడి సరుకులు నిల్వ ఉంచడానికి 11కోట్లతో అలిపిరి వద్ద గోడౌన్లు నిర్మాణ చేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా మంగళం నుంచి రేణిగుంట వరకు రోడ్డు అభివృద్ది పనులుకు 15 కోట్లు, యంఆర్ పల్లి జంక్షన్ నుంచి అన్నమయ్య వరకు రోడ్డు అభివృద్ది పనులుకు 4.5 కోట్లు, పుదిపట్ల జంక్షన్ నుంచి వకులామాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణంకు 21 కోట్లు కేటాయించటం జరిగిందన్నారు.
ఆయుర్వేద హాస్పిటల్ లో 1.65 కోట్లతో నూతన భవనం నిర్మాణం. రుయాలో టీబీ రోగులకోసం 1.79 కోట్లతో నూతన వార్డు నిర్మాణం. స్విమ్స్ లో 3.35 కోట్లతో నూతన భవనాలు నిర్మాణం. స్విమ్స్ లో నూతన కార్డియో, న్యూరో బ్లాక్ ల ఏర్పాటుకు 74 కోట్లు కేటాయించినట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. టీటీడీలో అర్హత ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యూలరైజ్ చేస్తామని అన్నారు. ప్రభుత్వ ఉత్వర్వులు మేరకు కాంట్రాక్ట్, కార్పొరేషన్ పరిధిలోఉన్న ఉద్యోగులను అర్హత మేరకు రెగ్యూలరైజ్ చేస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- యూరప్‌ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్‌లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్‌తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్‌పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







