ఎక్స్‌పో దోహా లోగోతో ప్రత్యేక నంబర్ ప్లేట్‌లు
- November 16, 2023
దోహా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఎక్స్‌పో 2023 దోహా లోగోను కలిగి ఉన్న లైసెన్స్ ప్లేట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. లైసెన్స్ ప్లేట్‌లు నవంబర్ 16 నుండి అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఆసక్తి గల వాహనదారులు నిర్ణీత రుసుము చెల్లించి లైసెన్స్ ప్లేట్‌ను పొందవచ్చని తెలిపింది. కొత్త లైసెన్స్ ప్లేట్‌ను ఆసక్తిగల వాహనదారులకు సులభంగా నమోదు చేసుకోవచ్చని, మొదటి సారి వాహన రిజిస్ట్రేషన్‌లతో సహా ఎవరికీ తప్పనిసరి కాదని ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రైవేట్ లైసెన్స్ ప్లేట్‌ల కోసం ప్రత్యేకంగా లోగో అందుబాటులో ఉందని పేర్కొంది. లోగోను నకిలీ చేయడం, ఇన్‌స్టాల్ చేయడం ఖచ్చితంగా నిషేధించబడింది. ఉల్లంఘించినవారు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







