'ఫ్లోటింగ్ సీ హార్స్' విల్లాల ప్రత్యేకత...
- May 25, 2016
ఎత్తైన భవంతిలోంచి బయటకు కనిపించే సుందరమైన దృశ్యాలతోపాటూ.. గదిలోంచే సముద్రపు అడుగు భాగంలోని అద్భుతమైన దృశ్యాలను తిలకించడానికి దుబాయి వేదిక కానుంది. ఎత్తైన భవంతి బుర్జ్ ఖలీఫాతో ఇప్పటికే ప్రపంచ పర్యాటకులను దుబాయి ఆకర్షిస్తోంది. దుబాయి తీరప్రాంతంలో మానవ నిర్మిత దీవుల్లో తేలియాడే సీ హార్స్ విల్లాలు సిద్ధం అవుతున్నాయి.సముద్ర ఉపరితలంతో పాటూ అంతర్భాంగలో కూడా గదులు ఉండటం 'ఫ్లోటింగ్ సీ హార్స్' విల్లాల ప్రత్యేకత. సముద్రంలోపల గదులు ఉన్నా..దృఢమైన అద్దాల సహాయంతో ఎలాంటి ప్రమాదం లేకుండానే ఇంట్లోనే ఉన్న అనుభూతి కలుగుతుంది. లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న పరికరాలు ఆ విల్లాలో ఉండటంతో ఒక దీవిలో ఉన్నామనే ఆలోచనే దరికి రాదు.ఒక్కో విల్లా 4000 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించారు. హై స్పీడ్ ఇంటర్నెట్, శాటిలైట్ టీవీలు, ఎసీలు, స్విమ్మింగ్ పూల్స్ తో పాటూ మరెన్నో సౌకర్యాలు ఫ్లోటింగ్ సీ హార్స్ ప్రత్యేకతలు. రిక్వెస్ట్ మీద పర్సనల్ చెఫ్ ను కూడా పెట్టుకునే అవకాశంఉంది. యూరోపియన్ ఆర్కిటెక్టులు వీటికి డిజైన్ చేశారు. 2018 వరకు మొత్తం 125 'ఫ్లోటింగ్ సీ హార్స్' విల్లాలను దుబాయి తీర ప్రాంతాల్లో నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించారు.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







