ప్యానెల్ యాపిల్ స్టోర్ల ప్రతిపాదనకు అంగీకారం..
- May 25, 2016
వాల్డ్ వైడ్ ఫేమస్ యాపిల్ ఫోన్లకు భారతదేశంలో కష్టాలు ఇక తగ్గనున్నట్టే కనిపిస్తోంది. ఇక స్వదేశీ స్టోర్లలో త్వరలోనే ఈ క్రేజీ ఫోన్లు లభ్యం కానున్నాయి. యాపిల్ సీఈవో టిమ్ కుక్ భారత పర్యటన నేపథ్యంలో ఈ ముఖ్యమైన పరిణామం చేసుకుంది. పూర్తిగా సొంతమైన రీటైల్ స్టోర్ల ఏర్పాటుకోసం యాపిల్ పెట్టుకున్న ప్రతిపాదనకు కండిషన్లతో కూడిన ఆమోదం లభించింది. ఈ మేరకు ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డ్ (ఎఫ్ఐపీబీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తిగా సొంతమైన రీటైల్ స్టోర్ల ఏర్పాటుకోసం చేసిన ఆపిల్ ప్రతిపాదనను అంగీకరించిన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు కచ్చితమైన షరతులతో ఆమోదం తెలిపింది. ఈ వార్తలను ప్రభుత్వ అధికారి ఒకరు మీడియాకు ధృవీకరించారు. లోకల్ సోర్సింగ్ సంస్థలకు 30 శాతం భాగస్వామ్యం కల్పించాలనే షరతు పెట్టిందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించిన ప్రకటన మరో రెండు రోజుల్లో వెలువడనుందని కూడా ఆయన ధృవీకరించారు.ప్రస్తుత డీఐపీనీ నియమాల ప్రకారం సింగిల్ బ్రాండ్ రిటైలింగ్ కోసం, స్థానిక ఉత్పత్తులకు 30 శాతం చోటు కల్పించాలనే నిబంధన ఉంది. అలాగు మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలో 51 శాతం, ప్రత్యేక పరిస్థితుల్లో కనీసం 30 శాతం భాగస్వామ్యం కల్పించాల్సి ఉంటుంది. వరకు అనుమతి ఉంది. ఈ మేరకు యాపిల్ మినహాయింపు నిచ్చిన ప్యానెల్ యాపిల్ స్టోర్ల ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. కాగా గత వారం ఆపిల్ ను ఇండియాలో ముందుకు తీసుకుపోవడమే లక్ష్యం ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇండియాలో పర్యటించారు. భారత్‌లో దీర్ఘకాలంపాటు వ్యాపార కార్యకలాపాలను కొనసాగించాలనుకుంటున్నామనీ, వచ్చే వెయ్యేండ్లపాటు సంస్థ సేవలందించనున్నామని ప్రకటించారు. రిటైల్ విక్రయాల విషయంలో యాపిల్‌కు మెరుగైన భవిష్యత్ ఉందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







