తమిళంలో మృణాల్ ఠాకూర్.! భలే ఛాన్స్ కొట్టేసిందిగా
- November 16, 2023
‘సీతారామం’ సినిమాతో సెన్సేషనల్ అయిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కి దిగుమతి అయిన ఈ అందాల భామ సౌత్‌లో పాగా వేసేసింది ఒక్క హిట్టుతోనే.
తెలుగులో స్టార్ హోదా సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. త్వరలో తమిళ తంబీల్నీ ఇంప్రెస్ చేయబోతోంది. యంగ్ హీరో శివ కార్తికేయన్ సరసన ఓ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది మృణాల్ ఠాకూర్.
స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కంచబోయే ఈ సినిమాలో మృణాల్ హీరోయిన్గా ఎంపికైందట. ఇదే తొలి తమిళ సినిమా మృణాల్ ఠాకూర్‌కి. తొలి ఛాన్స్‌కే ఈ స్థాయి సీనియర్ డైరెక్టర్‌తో పని చేసే అవకాశం దక్కించుకున్న మృణాల్ ఠాకూర్.. తదుపరి అక్కడ కూడా తన స్టార్ స్టేటస్‌ని కంటిన్యూ చేస్తుందేమో చూడాలి మరి.
అలాగే, తెలుగులో ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ సినిమాలోనూ, విజయ్ దేవరకొండ సరసన ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమాలోనూ మృణాల్ ఠాకూర్ నటిస్తోంది.
తాజా వార్తలు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్‌లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!
- ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!
- సౌదీలో కార్మికుల పై ప్రవాస రుసుము రద్దు..!!
- ఒమన్, భారత్ మధ్య కీలక అవగాహన ఒప్పందాలు..!!
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ







