సాయి పల్లవి బాటలోనే శ్రీలీల.!
- November 16, 2023
డాక్టరు కాబోయి యాక్టర్ అయిన చాలా మంది నటీ నటులున్నారు. కానీ, యాక్టింగ్ కొనసాగిస్తూనే మరోవైపు వైద్య వృత్తిని పట్టుదలతో పూర్తి చేసిన హీరోయిన్‌గా ఇంతవరకూ సాయి పల్లవికి మంచి రెస్పెక్ట్ గుర్తింపు వుంది.
ఇప్పుడు అదే తరహా గుర్తింపునూ, గౌరవాన్ని దక్కించుకోబోతోంది అందాల భామ శ్రీలీల. ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.
బోలెడన్ని సినిమాలతో శ్రీలీల చాలా చాలా బిజీగా వుంది. కానీ, కెరీర్, తన చదువుకు ఎలాంటి ఆటంకం కాకుండా చూసుకుంటోంది శ్రీలీల. షూటింగ్ గ్యాప్‌లోనే చదువుకుంటూ అటు చదువునూ, ఇటు యాక్టింగ్‌నీ సమానంగా బ్యాలెన్స్ చేస్తోంది.
ఎంబీబీఎస్ చదువుతున్న శ్రీలీలకు త్వరలో ఎగ్జామ్స్ వున్నందున షూటింగ్స్ నుంచి టైమ్ దొరకగానే బుక్స్‌తో కుస్తీ పడుతోందట. చదువు అనేది ప్రతీ ఒక్కరికీ చాలా ఇంపార్టెంట్ అని చెబుతోంది.
అంతేకాదు, హీరోయిన్‌గా ఇప్పుడు స్టార్‌డమ్ దక్కించుకున్నప్పటికీ, ఈ స్టార్‌డమ్ ఎప్పుడూ ఇలాగే వుండిపోదుగా.! సినిమాలుంటే చేస్తాను.. లేదంటే, డాక్టర్‌గా తన వృత్తిని కొనసాగించుకుంటానని క్యూట్‌గా చెప్పేస్తోంది అందాల భామ శ్రీలీల.
త్వరలో ‘ఆదికేశవ్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతోంది శ్రీలీల. ఈ సినిమాలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు.
తాజా వార్తలు
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!







